భార్యాభర్తలు ఒకేచోట ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణ
గజ్వేల్: స్పౌజ్ ఆప్షన్ వల్ల ఒకే చోట ఉద్యోగాలు చేసే అరుదైన అవకాశాన్ని పలువురు దంపతులు దక్కించుకున్నారు. ఒకే కార్యాలయంలో భర్త బాస్‌గా ఉంటే, భార్య కిందిస్థాయి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కోవలోనే ములుగు ఏడీఏ (అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(Assistant Director of Agriculture)(గా అనిల్ పనిచేస్తుండగా, భార్య ప్రగతి(Pragathi) ఆయన కిందిస్థాయి ఉద్యోగిగా ఏఓ(అగ్రికల్చర్ ఆఫీసర్)గా పనిచేస్తున్నారు. 2005లో ఏఓగా ఉద్యోగం పొందిన అనిల్(anil) ఆ తర్వాతికాలంలో ఏడీఏగా ప్రమోషన్ పొందారు.
2007లో ప్రగతిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు సైతం 2009లో ఏఓగా ఉద్యోగం వచ్చింది. కొండపాక, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో పనిచేసిన అనిల్ 2021లో ములుగుకు ఏడీఏగా వెళ్లారు. సంగారెడ్డి, సిద్దిపేట భూసార కేంద్రాల్లో పనిచేసిన ప్రగతి 2018 నుంచి ములుగులో ఏఓగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో స్పౌజ్ ఆప్షన్‌లో తన భర్త ఏడీఏ రావడంతో ఆమెకు కలిసి వచి్చంది. ఇంట్లో ఆమె బాస్ అయితే ఉద్యోగంలో మాత్రం భర్త బాస్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆయన హెచ్‌ఎం.. ఆమె టీచర్
గజ్వేల్ మండలం కొడకండ్లకు చెందిన శ్రీశైలం, సరిత దంపతులు. 2008లోనే టీచర్లుగా ఉద్యోగం సాధించారు. ఇరువురు వివిధ ప్రాంతాల్లో పనిచేసి ప్రస్తుతం జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒకే చోట పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో శ్రీశైలం హెచ్‌ఎంగా వ్యవహరిస్తుండగా, సరిత తన భర్త కిందిస్థాయి ఉద్యోగిగా టీచర్ విధులను నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment