కోతుల కోసం పండ్ల మొక్కలు, గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు
సాక్షి, దుబ్బాక(సిద్ధిపేట): కోతుల బెడదతతో ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. అడవుల్లో ఉండాల్సిన కోతులు గుంపులు గుంపులుగా గ్రామాలకు చేరాయి. అక్కడ వాటికి సరిపడా ఆహారం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాలకు వస్తున్నాయి. ఏకంగా ఇళ్లలోకి చోరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లుతున్నాయి. ఇండ్ల పైకప్పులను ధ్వంసం చేస్తున్నాయి. రైతులు పండించి కూరగాయలను, ఇతర ఆహార పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రస్థాయిలో నష్ట పోతున్నారు.
కోతుల బెడద నుంచి పంటలను రక్షించుకోవడానికి వాయిస్ అలారం ఏర్పాటు చేశారు. కొంత మంది రైతులు డప్పు చప్పుడు, టపాసులు కాల్చుతున్నారు. కోతులను బెదర కొట్టేందుకు కొన్ని గ్రామాల రైతులు ఇతర జిల్లాల నుంచి రూ.30 వేలు ఖర్చు పెట్టి కొండెంగలను కొనుగోలు చేసి తిప్పుతున్నారు. వాటి సంరక్షులకు ప్రతీ నెల జీతం ఇస్తున్నారు.
పద్మనాభునిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం
కోతుల బెడదను తప్పించడానికి అవి ఊర్లలోకి రాకుండా, పంట పొలాలను నష్టం చేయకుండా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలోని గ్రామ శివారులో ప్రత్యేకించి ‘మంకీ ఫుడ్‌కోర్టు’ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మూడు ఎకరాలను చదును చేసి అందులో పలు రకాల పండ్ల మొక్కలు నాటారు. అవి నాటి మూడు సంవత్సరాలైంది. మామిడి, జామ, దానిమ్మ, సపోట, సీతాఫలం, రేగుపండ్లు, బొప్పాయి, సంత్ర, అరటి, బత్తాయి, అల్లనేరేడు, వెలగ పండ్లు, ఖర్బూజ, దోస పండ్ల మొక్కలను పెంచుతున్నారు.
రాజక్కపేటలో కొండెంగలను తిప్పుతున్న గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment