
అమ్మ ఒక చోట.. నాన్న మరో చోట.. మేము ఇంకో చోట ఉంటున్నాం. మేమందరం ఒకే చోట ఉండేలా చూడాలని చేతుల్లో గోరింటాకుతో రాసి పెట్టుకుని పలువురు చిన్నారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మరికొంత మంది పిల్లలు తమ ఆలనాపాలన చూడటానికి తమ తల్లిదండ్రులకు సమయం సరిపోవడంలేదని, సీఎం కేసీఆర్ తాత మా అమ్మానాన్నను కలపాలని ఫ్లెక్సీలతో ర్యాలీలో పాల్గొన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన స్పౌజ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఈ విధంగా ర్యాలీ నిర్వహించారు.
–సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment