
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు
కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలోవిజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. శుక్రవారం పలు పథకాల పనితీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ మాట్లాడుతూ జీఓఎంఎస్ 58, 59 వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పుర్తి చేస్తామని తెలిపారు. అలాగే పామాయిల్ మొక్కల పెంపకాన్ని నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, డీఎప్‌ఓ శ్రీనివాస్, డీఎంఎచ్‌ఓ డాక్టర్ కాశీనాథ్, డీఏఓ శివప్రసాద్, డీఎచ్‌ఓ రామక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ నోడల్ అధికారి శ్యాంప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
అవినీతి పాలనను గద్దె దించాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి
సిద్దిపేటరూరల్: సీఎం కేసీఆర్ కుటుంబ పాలన చేస్తుంటే మోదీ ప్రజా పరిపాలన చేస్తున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు మోత్కు బుగ్గ రాజేశం ఏర్పాటు చేసిన ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కేసీఆర్ అవినీతి అహంకార పాలన గద్దె దించడమే లక్ష్యంగా జనాల్లోకి వెళ్లాలని సూచించారు. రూ.20 కోట్లతో మంజూరైన గురుకుల కళాశాల ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు కూడా దానిపై ఆలోచించకుండా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రుద్రోజ్ శివకుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బాబురెడ్డి బీజేవైఎం యూత్ అధ్యక్షుడు అచ్యుత్‌రెడ్డి, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు లతారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దేవరాజు, గంగాధర్. బాలరాజ్, ఎల్లం, రవి చారి రాజు, స్వరూప, రాజిరెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.