స్వగ్రామానికి చేరుకున్న రైతుబిడ్డ.. పూలవర్షం కురిపించిన అభిమానులు! | Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth Gets Grand Welcome By Fans In His Hometown - Sakshi
Sakshi News home page

Pallavi Prashanth Winning Celebrations: స్వగ్రామానికి ర్యాలీగా వెళ్లిన ప్రశాంత్.. ఫ్యాన్స్ గ్రాండ్‌ వెల్‌కమ్‌!

Published Mon, Dec 18 2023 7:47 PM | Last Updated on Mon, Dec 18 2023 8:38 PM

Bigg Boss Winner Pallavi Prashanth Gets Grand Welcome By Fans - Sakshi

సామాన్య రైతుబిడ్డగా బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్. వంద రోజులకు పైగా సాగిన తెలుగువారి బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్‌-7 ట్రోఫీని ముద్దాడారు. రైతుబిడ్డ అన్న సింపతి వర్కవుట్‌ అయినా.. తనలో ఉన్న టాలెంట్‌ను బయటకు తీశాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో మరో కంటెస్టెంట్‌ ‍అమర్‌దీప్‌తో పోటీపడి టైటిల్‌ సాధించాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్‌ పేరు మార్మోగిపోతోంది.

బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచిన రైతుబిడ్డ తన సొంత ఊరికి చేరుకున్నాడు. స్వగ్రామానికి చేరుకున్న ప్రశాంత్‌కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనిపై పూలవర్షం కురిపించారు. కారులో టాప్‌పై నిలిచి ఉన్న ప్రశాంత్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. రోడ్డు వెంట వందలాది మంది ఫ్యాన్స్ మధ్య ర్యాలీ నిర్వహించారు. టైటిల్‌ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ.. డీజే స్టెప్పులతో ఊగిపోతూ సిద్దిపేట జిల్లాలోని కోల్గురు చేరుకున్నారు. రోడ్డు  వెంట జనసందోహం నడుమ బిగ్ బాస్‌ విన్నర్‌ తన సొంతూర్లో అడుగుపెట్టారు. 

అయితే ప్రశాంత్ ట్రోఫీ గెలిచిన తర్వాత అన్నపూర్ణ  స్టూడియోస్ వద్ద ప్రశాంత్‌  హంగామా చేశారు. అయితే ఫ్యాన్స్ అత్యుత్సాహం కాస్తా కేసుల వరకు వెళ్లింది. అభిమానుల శృతిమించి ‍అమర్‌దీప్‌, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement