సాక్షి, సిద్దిపేట: ’’మీరు చూపించిన ప్రేమ చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి... మీ ఆదరణకు నేను ఎంత సేవ చేసినా తక్కువే. మీ ప్రేమ, ఈ బలగాన్ని చూస్తుంటే ఎన్ని జన్మలెత్తిన రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తోంది.. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అనిపిస్తోంది..’’అంటూ ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట రూరల్ మండలంలో ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భావోద్వేగానికి లోనయ్యారు.
హరీశ్ మాట్లాడుతూ.. నా ఊపిరి ఉన్నంతకాలం, చివరి శ్వాస వరకు మీ సేవ చేస్తూనే ఉంటా. పదవులు ఉండొచ్చు పోవచ్చు. మీ ప్రేమ ఆప్యాయత వెలకట్టలేనిదని బీఆర్‌ఎస్ శ్రేణులనుద్దేశించి అన్నా రు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మొద్దని, కళ్ల ముందు జరిగిన అభివృద్ధి చూ సి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
మోదీ వ్యాఖ్యలు విడ్డూరం
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని మంత్రి హరీశ్ వ్యాఖ్యానించారు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అమలు కాలేదని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోంది కేంద్రమేనని విమర్శించారు.
రూ.15 కోట్లతో ఏఈడీ మెషీన్లు..
సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమంలో మంత్రి హరీశ్ మాట్లాడారు. సీపీఆర్ ద్వారా 50శాతం మందిని బతికించవచ్చని, రాష్ట్ర వ్యాప్తంగా 36,520 మందికి సీపీఆర్‌పై శిక్షణ అందించామని చెప్పారు. రూ.15 కోట్లతో ఏఈడీ మెషీన్లను అందుబాటులోకి తెచ్చి అన్ని పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు, అంబులెన్స్‌లలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సీపీఆర్ శిక్షణ తీసుకున్నారు.
ఆటోడ్రైవర్... మినిస్టర్ హరీశ్
మంత్రి హరీశ్‌రావు కొద్దిసేపు ఆటో డ్రైవర్‌గా మారారు. ఆదివారం సిద్దిపేట ఆటో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సహకార సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన స్వయంగా ఆటో నడుపుతూ వచ్చారు. మంత్రిని చూసి ఆటోడ్రైవర్లు, ఆయన అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment