ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): ఘుమఘుమలాడే బిర్యానీ అంటే ఎవరికై నా ఇష్టమే.. కానీ బిర్యానీ తయారీకి ఉపయోగించే బియ్యం కడిగేది బాత్‌రూంలోని నీటితో అని తెలిస్తే?.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్‌లో బిర్యానీకి ఉపయోగించే బియ్యాన్ని బాత్‌రూంలోని నీటితో శుభ్రపరుస్తున్నారు. దీన్ని ఓ వినియోగదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
ఈ వీడియోలో.. ఎందుకు బాత్‌రూంలో బిర్యానీ బియ్యం కడుగుతున్నారని నిర్వాహకుల్ని వినియోగదారుడు ప్రశ్నిస్తే.. నీటి సమస్య వల్ల ఇలా చేస్తున్నట్టు ఇచ్చిన సమాధానం స్పష్టంగా వినిపిస్తోంది. దీంతో నెటిజన్లు.. ‘బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ, బిందె బిర్యానీ, స్టీల్ డబ్బా బిర్యానీ.. ఇలా చాలా రకాలను మీరు చూసి ఉంటారు.. కానీ మా సిద్దిపేటలో సరికొత్త బిర్యానీ ఆవిష్కరించారు.. అదే బాత్‌రూం బిర్యానీ.. తినండి సూపర్ టేస్ట్’.. అంటూ.. సోషల్‌మీడియాలో సైటెర్లు విసురుతున్నారు.
(చదవండి: రాష్ట్రంలో పెద్ద పులుల గాండ్రింపు!)
Comments
Please login to add a commentAdd a comment