
పట్నా: పిడుగుపాటుకు ఎనిమిది మంది చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన బిహార్‌లోని ధనపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులతో సహా.. మరొకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా భారీ వరదలతో ఇప్పటికే బిహార్ అతలాకుతలం అవుతోన్న విషయం తెలిసిందే. భారీ వరదల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. 26 లక్షల మంది నిరాశ్రయులు అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎగువన గల బ్రాహ్మపుత్ర నది పరివాహాన ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రభావం బిహార్‌పై పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి.