
ఆశి జయ(ఫైల్)
కవిటి, ఇచ్ఛాపురం రూరల్: శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇచ్ఛాపురం మండలంలోని జగన్నాథపురంలో వలంటీర్‌గా పనిచేస్తున్న ఆశి జయ (30) తన మరిదికి వధువును చూసేందుకు బంధువులతో కలిసి సమీప గ్రామమైన బిర్లంగి తోటూరుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వర్షం పడడంతో ఓ చెట్టు కిందకు చేరారు. సరిగ్గా అక్కడే పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే కవిటి మండలంలోని శావసానపుట్టుగకు చెందిన వివాహిత కోరాడ గౌరమ్మ (49) ఆదివారం కొబ్బరి తోటలో పనికి వెళ్లింది. సాయంత్రం అకస్మాత్తుగా పిడుగు పడడంతో అక్కికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలింది.
చదవండి:
టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..
ఆ ఇద్దరికీ పదవీ గండం?
Comments
Please login to add a commentAdd a comment