మృత్యు పిడుగు.. ఐదుగురిని చంపేసింది! | Five killed by lightning strike in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

మృత్యు పిడుగు.. ఐదుగురిని చంపేసింది!

Published Wed, Jun 28 2017 8:05 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

Five killed by lightning strike in Madhya Pradesh

డిండోరి(మధ్యప్రదేశ్‌): మృత్యు రూపంలో వచ్చిన పిడుగు ఐదుగురిని బలి తీసుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం డిండోరి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఒక మహిళతోపాటు నలుగురు బాలికలు మృతి చెందారు.

భరోతి గ్రామానికి చెందిన మహేశ్వరి పరాస్తే(26) ఆమె కుమార్తె శారద(9), పూనం (13), సుష్మా(13), నాన్‌ బాయి(14) కలిసి బుధవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని నదిలో స్నానం చేసి తిరిగి వస్తుండగా వారిపై పిడుగు పడింది. షాక్‌కు గురైన వారంతా అక్కడికక్కడే చనిపోయారు. ఇదిలా ఉండగా, వచ్చే 48 గంటల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement