Thunder Storm
-
పేద బతుకులు.. పిడుగుకు సమిధలు! ప్రమాదకర జోన్లో ఆ 13 జిల్లాలు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వెలుగు.. చీకటిని చీల్చి బతుకుపై భరోసానిచ్చే ఓ ఊపిరి! కానీ అదే మిరుమిట్లు గొలుపే వెలుగు నిరుపేదల బతుకును చీకటిలోకి నెడుతోంది. తీరని శోకాన్ని మిగుల్చుతోంది. ఆకాశంలో మేఘాల మధ్య జరిగే ఘర్షణ.. పిడుగుల గర్జనగా కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహంతో నిరుపేద రైతుకూలీల ప్రాణాలు తీస్తోంది. ప్రమాదాన్ని నివారించలేని విపత్తు నిర్వహణ సంస్థల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికే అరవై రెండు మంది పిడుగుపాటుతో పంట పొల్లాల్లోనే ప్రాణాలు వదలగా.. గత ఆరేళ్లలో ఏకంగా 398 మంది కన్నుమూశారు. తెలంగాణలో ఏటా సగటున లక్షా యాభైవేల నుండి రెండు లక్షల వరకు పిడుగులు పడుతున్నట్టు అంచనా. రైతులు, కూలీలు పంట పొలాల్లో ఎక్కువ సమయం గడిపే అక్టోబర్‌లోనే ఎక్కువగా పిడుగులు పడుతున్నాయి. అందులో 90శాతం గ్రామాల్లోనే పడుతుండగా.. మరణిస్తున్న వారిలో నూటికి 96 మంది రైతులు, కూలీలే ఉంటున్నారు. ఊహించని విపత్తుతో మరణించిన మెజారిటీ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కనీస ఆర్థిక సహాయం అందడం లేదు. భూమి ఉన్న రైతులు మరణిస్తే రైతు బీమా వర్తిస్తుండగా.. భూమి లేని నిరుపేదలు ఏళ్ల తరబడి సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రమాదకర జోన్లో 13 జిల్లాలు దేశంలో అత్యధికంగా పిడుగులు పడుతున్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. గత ఏడాది అక్కడ 6,55,788 పిడుగులు పడితే.. తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 5,76,498, మహారాష్ట్రలో 5,28,591 పిడుగులు పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మన పొరుగున ఉన్న కర్నాటక ఎనిమిదో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పదకొండో స్థానంలో, తెలంగాణ 1,49,336 పిడుగులతో పద్నాలుగో స్థానంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో చూస్తే.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి, కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట జిల్లాలు అత్యధిక పిడుగు పీడిత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. గత ఆరేళ్లలో అత్యధికంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 90 మంది పిడుగుపాటుతో చనిపోయారు. వరంగల్ జిల్లాలో 59, ఆదిలాబాద్‌లో 52, మెదక్‌లో 27 మంది చనిపోయారు. పిడుగులు 96 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే పడుతుండగా.. మృతుల్లో 98శాతం రైతులు, కూలీలే. మొత్తంగా గత ఆరేళ్లలో తెలంగాణలో 398 మంది నిరుపేదలు మరణించగా.. మరో 1,220 మంది గాయాలపాలయ్యారు. (చదవండి: రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ) నివారించే అవకాశమున్నా.. పిడుగుపాటు మరణాలను నివారించే అవకాశమున్నా.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. పిడుగుపాటు నష్టాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన అరెస్టర్లు, కండక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. పుణె ఐఐటీ దామిని అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అది 20 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే అప్రమత్తం చేస్తుంది. దీనికితోడు ఎర్త్ నెట్వర్క్ అనే అమెరికా సంస్థ సైతం అధునాతన పరికరాలను మార్కెట్లోకి తెచ్చింది. పలు రాష్ట్రాల్లో గ్రామ, మండల యంత్రాంగాలు వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం భారీ నష్టానికి కారణం అవుతోంది. పొరుగున ఉన్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మెరుగైన పద్ధతులతో పేదల ప్రాణాలు కాపాడుతున్నారు. కోట్ల వోల్టుల శక్తితో పిడుగులు మేఘాల నుంచి ఒక్కసారిగా విడుదలయ్యే ఎలక్ట్రాన్లు 15–30 కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహంతో భూమ్మీదకు దూసుకువచ్చే శక్తినే ‘పిడుగు’ అంటారు. ఒక మేఘం నుంచి మరో మేఘానికి ప్రసారమయ్యే పిడుగుల వల్ల ఆకాశంలో ఎగిరే విమానాలకు ముప్పు ఉంటుంది. మేఘం నుంచి భూమిని తాకే (క్లౌడ్ టు గ్రౌండ్) పిడుగులు మనుషులు, ఇతర జీవజాలానికి ముప్పు కలిగిస్తున్నాయి. పూరి గుడిసెలో బంగారమ్మ.. వనపర్తి జిల్లా బాలకిష్టాపూర్‌లో జూన్ 6, 2017న పడిన పిడుగులు ఒకే ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములను పొట్టనపెట్టుకున్నాయి. ముళ్ల పొదలు తొలగించే క్రమంలో ఆకాశమంతా ముప్పై సెకన్లపాటు వెలుగును చిమ్ముతూ పడిన పిడుగుతో తెలుగు లక్ష్మన్న (40), ఈదన్న (52), పరమేశ్ (27) ప్రాణాలు వదిలారు. ఊరంతా కన్నీరు పెట్టింది. ఆదుకుంటామంటూ ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు ఆపద్బంధు కింద సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. ఆ ముగ్గురిలో ఈదన్న, లక్ష్మన్న కుటుంబాలకు పాత ఇళ్లయినా ఉండగా.. చివరివాడైన పరమేష్‌కు సొంత ఇల్లు కూడా లేదు. ఆయన భార్య బంగారమ్మ(24) రోజు కూలీకి వెళ్తూ.. సగం కూలిన గుడిసెలోనే కాలం వెళ్లదీస్తోంది. ఇలాంటి విషాద గాధలు ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. (చదవండి: రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కున్న మహిళ.. వీడియో వైరల్) కాలం కాటేసినా.. కదలని యంత్రాంగం అక్టోబర్ 9, 2021లో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ పరిధిలోని బుర్కపల్లిలో సోయా చేనులో పనిస్తుండగా పిడుగుపాటుతో గరణ్ సింగ్ (45), ఆయన తమ్ముడి భార్య ఆశాబాయి (30) మరణించారు. విపత్తు పరిహారం కోసం బాధిత కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. త్రీమెన్ కమిటీ విచారణ పూర్తయినా ఇంకా పరిహారం అందలేదు. తక్షణ కార్యాచరణ అవసరం జాతీయ స్థాయిలో ప్రధాని చైర్మన్‌గా, నిపుణులు వైస్ చైర్మన్‌గా ఉండే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) తరహాలోనే రాష్ట్రస్థాయిలో సీఎం చైర్మన్‌గా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పనిచేయాలి. మన రాష్ట్రంలో విపత్తుల నిర్వహణను మర్చిపోయారు. వరద వచ్చాక సహాయక చర్యలు చేస్తున్నారు. అలాంటిది ముందే పిడుగుపాటు నివారణ చర్యలు ఎజెండాలోనే లేకపోవడం దారుణం – మర్రి శశిధర్‌రెడ్డి, ఎన్డీఎంఏ మాజీ వైస్ చైర్మన్ నివారించదగిన ప్రమాదాలు.. పిడుగు అనేది వంద శాతం నివారించదగ్గ విపత్తు. కానీ తెలంగాణలో పిడుగులతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందుబాటులోకి వచ్చిన అరెస్టర్లు, కండక్టర్లతో పిడుగుపాటు మరణాలను అరికట్టవచ్చు. పిడుగుపాటు సమయాలను ముందే తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. ఇలాంటి చర్యల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో ఆ ప్రయత్నాలేవీ మొదలుకాలేదు. తగిన సలహాలు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. – కల్నల్ సంజయ్ శ్రీవాస్తవ, క్లైమైట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్, న్యూఢిల్లీ -
AP: ఈ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీంతో, ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం ప్రభావంతో కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరం వెంబడి గంటలకు 45 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలని వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అక్కడక్కడా భారీవర్షాలు కురవగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో పాలకోడేరులో 14 సెంటీమీటర్లు, నూజివీడులో 11, సెట్టిగుంటలో 10.3, పూసపాటిరేగ, బలిజపేటల్లో 9, భీమడోలు, భీమవరం, కళింగపటా్నల్లో 8, ఆళ్లగడ్డలో 7.8, ఇబ్రహీంపట్నంలో 7.4, చింతలపూడి, తెర్లాం, జియ్యమ్మవలసల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
పిడుగుపాటుకు ఒకే రోజు 9 మంది మృతి!
భోపాల్: పిడుగులు పడి మధ్యప్రదేశ్‌లో ఒకే రోజు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. విదిశా, సట్నా, గుణా జిల్లాల్లో పిడుగులు పడి ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సైతం భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. చెట్టుకింద నిలుచోవటమే శాపంగా మారింది.. విదిశా జిల్లాలోని అగసోడ్ గ్రామంలో శనివారం సాయంత్రం వర్షం వస్తుందని నలుగురు ఓ చెట్టుకింద తలదాచుకున్నారు. అయితే.. అదే చెట్టుపై పిడుగు పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోనే జరిగినట్లు సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కున్వర్ సింగ్ ముకటి తెలిపారు. మృతులు గాలు మాలవియా, రాము, గుడ్డా, ప్రభు లాల్‌గా గుర్తించారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సింగ్ తెలిపారు. సట్నా జిల్లాలోని పోడి పతౌరా, జట్వారా ప్రాంతాల్లో శనివారం సాయంత్రం పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అంజన, చంద్రా, రాజ్‌కుమార్, రామ్‌కుమార్ యాదవ్‌గా గుర్తించారు. గుణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇదీ చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ -
హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్ష బీభత్సం.. విమానాల దారి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోని పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. కాసేపటికే వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు వీయడంతో పలు కాలనీల్లో కరెంట్ సప్లై నిలిచిపోయింది. pic.twitter.com/AhQYuP9TwH — IMD_Metcentrehyd (@metcentrehyd) April 21, 2022 ఇదిలా ఉండగా.. ఈదురు గాలులు బలంగా వీయడంతో వాతావరణం అనుకూలించక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. రెండు విమానాలను ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు మళ్లించగా.. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించారు. Wow..Rain Start..🌧️🌧️#Hyderabad #Office#Ramoji Film City#rain @HiHyderabad @Hyderabad_Bot @swachhhyd @Ramoji_FilmCity pic.twitter.com/nzBXNC0VCv — Priyanka Sahoo (@Priyank41223414) April 21, 2022 ఇది చదవండి: కంట్రోల్లోనే కరోనా.. మాస్క్‌లు ధరించాల్సిందే!: తెలంగాణ డీహెచ్ -
ఈ ప్రాంతాలకు పిడుగు హెచ్చరిక
సాక్షి, విజయవాడ: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఉపరితల ఆవర్తనం కోనసాగుతున్నందున ఈశాన్య బంగాళఖాతంతో రాగల రెండు రోజుల్లో అల్ఫపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల రాగల 3 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కృష్ణానది వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముంద్రంలో వేటకు వెళ్లరాదని కమిషనర్ కన్నబాబు సూచించారు. ఈ ప్రాంతాలకు కమిషనర్ పిడుగు హెచ్చరిక.. అదే విధంగా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలకు పిడుగు కూడా పిడుగు హెచ్చరిక చేశారు. కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యాపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు, మైలవరంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గోర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు. వర్షం పడుతున్న సమయంలో సురక్షితమైన భవనాలల్లో ఆశ్రయం పోదాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. రాగల 3 రోజుల పాటు వాతావరణ వివరాలు: సెప్టెంబర్ 19న: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం. సెప్టెంబర్ 20: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు.మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం. సెప్టెంబర్ 21: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా,కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం. -
హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రానున్న మూడు గంటల్లో తెలంగాణలో చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అంతేగాక పలు చోట్లు పిడుగు పడే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దోని జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే 040 29555500, 040 21111111కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అదే విధంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలల్లో భారీ వర్షం కురిసే అన్ని ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం, ఎమర్జెన్సీ బృందాలను ఆయన అప్రమత్తం చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలంగాణలో దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 2.1 కిమీ ఎత్తు వరకు కొనసాగుతోంది. తూర్పు-పశ్చిమ షేర్ జోన్లో పెనిన్సులర్ 6.0 అక్షాంశం వెంబడి భారతదేశం మీదుగా 4.5కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. అంతేగాక ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు దాని పరిసర ప్రాంతాలలో 3.1కిమీ నుంచి 3.6 కిమీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇక ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబరు 20వ తేదీన వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. (హైదరాబాద్ వర్షాలు: కొట్టుకొచ్చిన మొసళ్లు) ఆదిలాబాద్, కోమురంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, జిల్లాలలో ఇవాళ ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం కూడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం మాత్రం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. -
‘ఇప్పుడు మీరు లాటరీ టికెట్ కొనొచ్చు’
వర్షం వస్తే చాలు ఆకాశంలో మెరుపులు, అక్కడక్కడ పిడుగులు పడటం సహజమే. అయితే ఆ సమయంలో చెట్ల కింద కాని ఎత్తైన వాటి కింద ఉండొద్దని పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లోనే పిడుగులు, మెరుపులు పడే ప్రమాదం ఎక్కవ కాబట్టి. కానీ వాటిని పెడచెవిన పెట్టి ఎమౌతుందిలే అని అనుకునే వాళ్లు ఈ దృశ్యాన్ని తప్పక చూడాల్సిందే. వర్షంలో బయటకు వెళ్లిన ఓ వ్యక్తిపై ఒక్కసారిగా ‘మెరుపు దాడి’ చేయడంతో షాక్ గురయ్యాడు. ఈ భయానకమైన అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు... దక్షిణ కరోలీనాకు చెందిన రోములస్ మెక్నీల్ గొడుగుతో వర్షంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక్కసారిగా తనపైకి మెరుపు రావడంతో ఉలిక్కిపడిన సంఘటన అక్కడి కెమరాలలో రికార్డు అయ్యింది. ‘నేను ఓ భయానక సంఘటనను ఎదుర్కొన్నాను కానీ ఈ ఘటనలో నాకు పెద్దగా గాయాలేమి కాలేదంటూ’ మెక్నీల్ తన ఫేస్బుక్లో ‘మెరుపుదాడి’కి సంబంధించిన వీడియో, ఫోటోలు షేర్ చేశాడు. దీంతో వీడియో చూసిన నెటిజన్లంతా షాక్‌కి గురై.. కామెంట్స్ రూపంలో మెక్‌నీల్‌పై సానుభూతి తెలుపుతున్నారు. ‘హమ్మయ్య మీకు ఏమి జరగలేదు సంతోషం’, ‘మీరు చాలా అదృష్టవంతులు రోమ్ పెద్దగా గాయపడలేదు.. కానీ ఇలాంటి సమయంలో అందరు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి’ అని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే మరికొందరు ‘ఇప్పుడు నువ్వు లాటరీ టిక్కెట్ కొనుక్కోవాలి’ అంటూ సరదా కామేంట్స్ పెడుతున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో పిడుగు పాటుకు 12 మంది మృతి
-
తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల భీభత్సం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం 12 మంది పిడుగు బారిన పడి మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు పిడుగులు పడటంతో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో పిడుగులు పడి ఇద్దరు మృతిచెందగా.. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురంలో మరో ఇద్దరు పిడుగుల బారిన పడి మరణించారు. పట్టణం బలగలో పిడుగుపాటుకు పొట్నూరు యోగీశ్వర రావు, రణస్థలం మండలం పాపారావు పేటలో13 ఏళ్ల బాలిక పిడుగు పడి మృతి చెందారు. జిల్లాలో భారీగా వర్షం పడుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇటు తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములతో వర్షం పడుతోంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతోపాటు పిడుగుపాటుకు జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. బీ కోడూరు మండలం మేకవారి పల్లెలో పిడుగు పాటుకు సిద్దు వెంకటరమణా రెడ్డి అనే పోస్టుమెన్ మృతిచెందగా.. కాజీపేట మండలం బీచువారి పల్లె గ్రామంలో పిడుగు పాటుకు ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కడప ఆసుపత్రికి తరలించారు. వీరిలో దస్తగిరమ్మ మృతి చెందగా.. బీబీ చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా విజయనగరం ఎస్ కోట మండలం కాపు సోంపురానికి చెందిన చింతాడ రమణ అనే రైతు పిడుగు పడి మృతి చెందాడు. వికాబారాద్ జిల్లా ధారుర్ మండలంలోని అవుసూపల్లి సమీపంలో ఉన్న రాంమందిరం వద్ద ఇద్దరు అనుమనాస్పద మృతి చెందారు. వారు పిడుగు పడి మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చెశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం.. పిడుగులు!
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు పిడుగులు పడటంతో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో పిడుగులు పడి ఇద్దరు మృతిచెందగా.. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురంలో మరో ఇద్దరు పిడుగుల బారిన పడి మరణించారు. జిల్లాలో భారీగా వర్షం పడుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇటు తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములతో వర్షం పడుతోంది. -
పిడుగు కాటు
-
క్యుములోనింబస్ వల్లే అకాల వర్షాలు
-
మృత్యు పిడుగు.. ఐదుగురిని చంపేసింది!
డిండోరి(మధ్యప్రదేశ్): మృత్యు రూపంలో వచ్చిన పిడుగు ఐదుగురిని బలి తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం డిండోరి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఒక మహిళతోపాటు నలుగురు బాలికలు మృతి చెందారు. భరోతి గ్రామానికి చెందిన మహేశ్వరి పరాస్తే(26) ఆమె కుమార్తె శారద(9), పూనం (13), సుష్మా(13), నాన్ బాయి(14) కలిసి బుధవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని నదిలో స్నానం చేసి తిరిగి వస్తుండగా వారిపై పిడుగు పడింది. షాక్‌కు గురైన వారంతా అక్కడికక్కడే చనిపోయారు. ఇదిలా ఉండగా, వచ్చే 48 గంటల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. -
నంద్యాలలో భారీ వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాలు రాష్ట్ర్రంలోకి ప్రవేశించడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో పిడుగులు పడే ప్రమాదం ఉందని జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించింది. శనివారం నంద్యాలలో అత్యధికంగా 55.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. -
పిడుగుపాటుకు యువకుడు బలి
యాచారం (రంగారెడ్డి) : పిడుగుపాటుకు యువకుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్యాం(24) ఇంటి పైన ఉన్న బట్టలు తీయడానికి వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
ప్రకృతి వి‘చిత్రం’
నెవడాలోని ఈ వాతావరణ విచిత్రాన్ని రాల్ఫ్ మేడెర్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. నెవడాలోని మోరాన్ పాయింట్ వద్ద తీసిన ఫొటో ఇది. వేసవి ముగిసే తరుణంలో అధిక ఉష్ణోగ్రతలు వాతావరణంలోని తేవుతో కలసి, స్థానిక తుపానులకు దారితీస్తాయి.. అలాంటి తుపాను వచ్చే ముందు ఇలా ఆకాశంలో మబ్బులు, మెరుపులు కనిపిస్తాయి. ‘పుర్రె’కో బుద్ధి! వెల్వియిన్ గార్డెన్ సిటీకి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ జెర్మీ గిబ్స్కు తన ఇంటి పరిసరాలను సృజనాత్మకంగా తీర్చిదిద్దడమంటే మహా సరదా. అందుకే గార్డెన్‌లోని మొక్కలను ఇలా రకరకాల జంతువుల చేతులు, మనిషి పుర్రె ఆకృతిలో కత్తిరించి తన ఇంటికే కొత్త అందాన్ని తీసుకొస్తున్నాడు. గత 20 ఏళ్లుగా ఇలా విభిన్న ఆకృతుల్లో తన ఇంటి పరిసరాలను రూపొందిస్తున్న ఈ డాక్టర్ అందరినీ తన అరుదైన కళతో అబ్బురపరుస్తున్నాడు. ఆకాశంలో ఆలయం.. అపార్ట్‌మెంట్లపైన పెంట్ హౌస్‌లు కట్టుకోవడం మనం చూశాం. చైనాలో మాత్రం ఇలా ఏకంగా ఆలయాన్నే కట్టేశారు. షెంజెన్ నాన్ఫాంగ్ జిల్లాలో 21 అంతస్తులున్న ఓ ఆకాశహర్మ్యంపైన నిర్మితమైన ఆలయమిది. అయితే, ఇది ఎవరో ప్రైవేటు వ్యక్తులకు చెందినదని భావిస్తున్నారు. చైనాలో ఈ మధ్య అక్రమంగా రూఫ్‌టాప్ నిర్మాణాలు కట్టడం ఎక్కువైపోయింది. ఇది కూడా అలాంటి బాపతేనని అనుమానిస్తున్నారు. పాతవాటితో ప్రజలకు పాఠం.. జర్మనీలో విద్యుత్‌ను వేస్ట్ చేయడం బాగా ఎక్కువైపోయిందట. దీంతో ఆ దేశానికి చెందిన రాల్ఫ్ స్కీమర్బెర్గ్ అనే ఆర్టిస్ట్ ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న ఇగ్లూను నిర్మించారు. ఇగ్లూను మంచుతో తయారుచేస్తారన్నది మనకు తెలిసిందే. దీన్ని చేయడానికి మాత్రం ఆయన 322 పాత ఫ్రిడ్జ్‌లను వాడారు. పైగా.. ఇవి ఎంత విద్యుత్‌ను ఖర్చు పెడుతున్నాయన్న విషయాన్ని తెలియజేయడానికి బయటో కరెంట్ మీటర్‌ను కూడా పెట్టారు.