సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోని పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. కాసేపటికే వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు వీయడంతో పలు కాలనీల్లో కరెంట్ సప్లై నిలిచిపోయింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) April 21, 2022
ఇదిలా ఉండగా.. ఈదురు గాలులు బలంగా వీయడంతో వాతావరణం అనుకూలించక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. రెండు విమానాలను ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు మళ్లించగా.. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు మళ్లించారు.
Wow..Rain Start..🌧️🌧️#Hyderabad #Office#Ramoji Film City#rain @HiHyderabad @Hyderabad_Bot @swachhhyd @Ramoji_FilmCity pic.twitter.com/nzBXNC0VCv
— Priyanka Sahoo (@Priyank41223414) April 21, 2022
ఇది చదవండి: కంట్రోల్‌లోనే కరోనా.. మాస్క్‌లు ధరించాల్సిందే!: తెలంగాణ డీహెచ్
Comments
Please login to add a commentAdd a comment