సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు పిడుగులు పడటంతో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో పిడుగులు పడి ఇద్దరు మృతిచెందగా.. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురంలో మరో ఇద్దరు పిడుగుల బారిన పడి మరణించారు. జిల్లాలో భారీగా వర్షం పడుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇటు తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములతో వర్షం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment