
ఆదిలాబాద్ రూరల్: పిడుగుపాటుకు మృతి చెందడం.. గాయపడటం సాధారణం. కానీ పిడుగుపాటు వేడికి ఒక మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు కరిగి పోయి ఆమె శరీరానికి అతుక్కుపోయి ఆమెను ఆస్పత్రిపాల్జేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగింది. మండలంలోని పొచ్చర గ్రామ సమీపంలోని దిమ్మ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ పిడుగు పడింది.
సమీపంలోనే వ్యవ సాయ పనుల్లో శ్వేత నిమగ్నమై ఉండగా.. పిడుగు పడింది. దీంతో వెలువడిన వేడిమికి ఆమె మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. వెంటనే స్థానికులు ఆమెను 108లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment