సాక్షి, మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలో పిడుగుపాటుకు భూమి కుంగిపోయింది. గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
చిమ్మ చీకట్లో అకస్మాత్తుగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సమీపంలో ప్రధాన రహదారి పక్కన పిడుగులు పడ్డాయి. సోమవారం ఉదయం లేచి చూసేసరికి పిడుగు పడిన చోట భూమి కుంగిపోయిందని ఆ గ్రామ సర్పంచ్ రామశివ సుబ్రహ్మణ్యం చెప్పారు.
చదవండి: ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Comments
Please login to add a commentAdd a comment