![11 People Injured By Lightning Strike In Sircilla District - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/15/WHATSAPP-IMAGE-2022-05-14-A.jpg.webp?itok=GSfX20ht)
కామారెడ్డి క్రైం/కోనరావుపేట(వేములవాడ): కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పిడుగులు పడి పదకొండు మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండా శివారులో శనివారం సాయంత్రం బూ క్యా బందర్, అతని భార్య బుల్యా, కొడుకు రాజేందర్, తండాకు చెందిన బూక్యా లక్ష్మి, బూక్యా హుస్సేన్, ఇస్లావత్ గం గులు పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం వచ్చింది.
వెంట నే వారంతా ఓ చెట్టుకిందకు వెళ్లారు. అదే సమయంలో వారికి సమీపంలో పిడుగు పడడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అందరూ అ పస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
రాజన్న జిల్లాలో..
రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శనివారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షం రావడంతో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో పిడుగు పడడంతో చెట్టుకింద తలదాచుకున్న ఐదుగురు రైతులకు గాయాలయ్యాయి.
ఈ ఘటనలో గాయపడ్డ మామిడిపల్లికి చెందిన పన్నాల హన్మాండ్లు, పన్నాల దేవీవెంకటేశ్, అన్నాడి ఎల్లారెడ్డి, మారు మోహన్‌రెడ్డి, మారు బుచ్చిమల్లవ్వలను వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మండల అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment