యువకుడి ప్రాణం తీసిన ఫోన్‌ సిగ్నల్‌ | Man lose Life Due to Lightning in badradri Kottagudem Went for Phone Signal | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణం తీసిన ఫోన్‌ సిగ్నల్‌

Published Wed, Jul 15 2020 10:20 AM | Last Updated on Wed, Jul 15 2020 11:26 AM

Man lose Life Due to Lightning in badradri Kottagudem Went for Phone Signal - Sakshi

సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రిజిల్లా కొత్తగూడెంలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన ఈసం కృష్ణ(22) తన స్మార్ట్ ఫోన్ లో త్రీజీ సిగ్నల్ సరిగా రాక పోవడంతో సిగ్నల్‌ కోసం  పక్కనే ఉన్న గొరకలమడుగు గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఓ చింత చెట్టు కింద సిగ్నల్‌ రావడంతో దాని కింద నిల్చుని ఫోన్‌ చూసుకుంటున్నాడు. చదవండి: జూరాలకు పోటెత్తిన వరద ఉ‍ధృతి..

అప్పటికే అక్కడ భారీ వర్షం పడుతుండటంతో అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో కృష్ణ అక్కడికక్కడే మరణించాడు. శంభునిగూడెం గ్రామంలో త్రీజీ సిగ్నల్ సరిగా రాదు. దీంతో ఆ గ్రామానికి చెందిన వారంతా సిగ్నల్‌ కోసం గొరకలమడుగు గ్రామానికి వెళుతుంటారు. చాలా మంది యువకులు చాటింగ్ కోసం ఎక్కువగా ఆ చెట్టు కిందకే వెళుతుంటారు.  సిగ్నల్స్ కోసం వెళ్లిన కృష్ణ పిడుగుపాటుకు గురై మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

చదవండి: శ్రీశైలం చేరిన కృష్ణమ్మ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement