
పాట్నా : బిహార్ ప్రజలను పిడుగులు బెంబేలెత్తించాయి. దాదాపు గంటపాటు బీభత్సం సృష్టించిన పిడుగు పాట్లకు 11 మంది దుర్మరణం చెందారు. 13 మంది గాయాలపాలయ్యారు. సహర్సా జిల్లాలో పిడుగుల ధాటికి ఆరుగురు, దర్భంగలో నలుగురు, మధేపురాలో ఒకరు మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
గాయాలపాలైనవారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. పిడుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment