పిడుగుపాటుతో ఓ మహిళ మృతి చెందింది.
నక్కలవాడ (ఆదిలాబాద్): పిడుగుపాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని నక్కలవాడ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (45) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. అయితే ఆమె పనిచేస్తున్న సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.