గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి | woman dies in auto collisioned incident in gachibowli | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

Published Sat, Feb 4 2017 7:37 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి - Sakshi

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

హైదరాబాద్‌: గచ్చిబౌలి ఐటీ చౌరస్తాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రిపుల్‌ ఐటీ చౌరస్తాలో ముగ్గురు మహిళలు రోడ్డు దాటుతుండగా సెవెన్ సీటర్ ఆటో వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితులు సమీపంలోని ఐటీ సంస్థలో హౌస్ కీపింగ్‌ పనులు చేస్తుంటారని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement