సాక్షి, హైదరాబాద్: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. మితి మీరిన వేగంతో బైక్‌పై వెళ్తూ అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టి ఫ్లై ఓవర్‌పై నుంచి పడి మృతి చెందాడు.
వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌పైనున్న డివైడర్‌ను ఢీకొన్నారు. దీంతో ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్ మీదకు పడిపోయారు. కాగా, మెదక్ జిల్లా కకునూరుపల్లికి చెందిన బండి మధు(26), సూర్యాపేట జిల్లాకు చెందిన మచ్చగిరి (24) గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ టెక్నీషియన్లుగా పనిచేస్తూ మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరు బైకుపై ఆస్పత్రికి బయలుదేరారు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై షాగౌస్ సమీపంలో ఫ్లై వర్‌పై కుడి వైపు రెయిలింగ్‌కు ఢీ కొట్టడంతో ఫ్లై ఓవర్ నుంచి కింద పడ్డారు.
కాగా, తీవ్ర గాయాలతో మధు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో గిరి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు పేర్కొంటున్నారు. టిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలంటే బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు అటు వైపు వెళ్లారో అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
ఇది కూడా చదవండి: టమాటా దొంగలు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment