ఆటో నుంచి పడి వృద్ధురాలి మృతి | woman dies of auto to fall | Sakshi
Sakshi News home page

ఆటో నుంచి పడి వృద్ధురాలి మృతి

Published Wed, May 24 2017 11:56 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

woman dies of auto to fall

రాయదుర్గం రూరల్ : రాయదుర్గం మండలం జుంజురాంపల్లి-రేకులకుంట గ్రామాల మధ్య జరిగిన మరో ప్రమాదంలో మలకాపురానికి చెందిన అంజినమ్మ(50) మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ​మలకాపురానికి చెందిన 16 మంది కూలీలు రేకులకుంటకు చెందిన కురుబ రామాంజినేయులు అనే రైతు తోటలో ఉల్లినారు నాటేందుకు ఉదయమే ఆటోలో బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటో జుంజురాంపల్లి దాటగానే ఆటో వెనుక డోరుపై కూర్చొన్న తిమ్మక్క, అంజినమ్మ, రత్నమ్మ, వన్నూరక్క నలుగురూ అదుపుతప్పి కిందడిపోయారు. వారిలో అంజినమ్మ తలకు తీవ్ర దెబ్బలు తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వారందరినీ రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అంజినమ్మ మృతి చెందినట్లు అక్కడ పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement