రంగారెడ్డి: కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్బిణి మృతి చెందిన సంఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దాంతో గర్బిణి బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
అనంతరం ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాన్పు కోసం వచ్చిన గర్బిణికి వైద్యులు సకాలంలో వైద్యం చేసి ఉంటే తప్పక తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేవారని మృతురాలి బంధువులు తెలిపారు.