డిప్యూటీ సీఎం ఎస్కార్ట్ వాహనం ఢీ కొన్న ఘటనలో గాయాలు
వరంగల్: ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో గాయపడిన గులాం సాదికున్నీసా బేగం (48) శుక్రవారం వేకువజామున మృతి చెందింది. మృతురాలి భర్త కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నిడమనూర్‌కు చెందిన గులాం గౌసు, సాదికున్నీసాబేగం దంపతులు నవంబర్ 30న వరంగల్ నుంచి నల్లగొండకు బయల్దేరారు. ఈ క్రమంలో జనగామ మండలం యశ్వంతాపూర్ దగ్గర డిప్యూటీ సీఎం రాజయ్య ఎస్కార్ట్ వాహనం టైరు పగిలి ఆ దంపతులు ప్రయూణిస్తున్న కారును ఢీకొంది. దీంతో సాదికున్నీసా బేగంకు తీవ్రగాయాలు కాగా, హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స అనంతరం ఈ నెల 24న డిశ్చార్జ్ అరుు్యంది. వారు వరంగల్‌లోని ఎఫ్‌సీఐ కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. కాగా, శుక్రవారం వేకువ జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. రోడ్డుప్రమాదంతో పక్కటెముకల్లో రక్తం గడ్డకట్టడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి రక్తం వెళ్లడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని గౌస్ వెల్లడించారు. మృతురాలి కుమార్తె షహాజదీమోహ్‌వీన్(7) తల్లి మృతదేహాన్ని చూసి నిద్రపోరుుందా అని అడగడం చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యూరు.
డిప్యూటీ సీఎం వాహనం ఢీకొట్టిన మహిళ మృతి
Published Sat, Dec 27 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement