ఇన్నోవా బోల్తా: మహిళ మృతి | innova rolls and woman dies | Sakshi
Sakshi News home page

ఇన్నోవా బోల్తా: మహిళ మృతి

Aug 1 2015 6:31 PM | Updated on Sep 3 2017 6:35 AM

నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. నలుగురికి గాయాలయ్యాయి.

సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్‌కు చెందిన ఓ కుటుంబం ఆదిలాబాద్‌లో బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా మండలంలోని దగ్గి గ్రామ శివారులో అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో వాహనంలో ఉన్న భాగ్యలక్ష్మి(46) అక్కడికక్కడే మృతి చెందగా.. మాధవి, మునీంద్రాచారి, బ్రహ్మచారి, సాత్విక అనే నలుగురు  గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement