bhagya laxmi
-
కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థత
సాక్షి, విశాఖపట్నం: కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వివాఖ ఏజెన్సీలోని మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మలకపాలెంలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన ఆవు మాంసాన్ని తినటం వల్ల ఈ ఘటన జరిగినట్టు వైద్యులు గుర్తించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. -
ఘాట్‌రోడ్డులో చెట్లు నరికిన దుండగులు
సీలేరు(పాడేరు): విశాఖ ఏజెన్సీ దారా లమ్మ ఘాట్‌లో దారలగొంది ప్రాంతం వద్ద మంగళవారం రాత్రి 7.30గంటల సమయంలో రెండు చెట్లను దుండగులు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. రెండుమూడు రోజులుగా పాడేరు అసెంబ్లీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తుండడంతో గిరిజనులు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని చూసి ఓర్వలేక పార్టీని, పార్టీ నాయకులను భయపెట్టేందుకు ఈ రకంగా నరికి ఉంటారని దారకొండ వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సీలేరు, దుప్పులవాడ, ధారకొండ, గుమ్మిరేవుల ప్రాంతాల్లో అర్థరాత్రి కూడా ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో కూడా జనాలు అధిక సంఖ్యలో తరలిరావడంతో అది చూసి ఓర్వలేక ఇలా చేశారని వారు తెలిపారు. 7గంటల సమయంలో ప్రచారం ముగించుకుని తిరిగి పాడేరు వెళ్తుం డగా చెట్లు నరికారని చెప్పారు. ఇది ముమ్మాటికి ఇతర పార్టీల నాయకుల పనేనని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని సీలేరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సూచన మేరకు భాగ్యలక్ష్మి తిరిగి సీలేరు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ జిల్లా కార్యదర్శి జల్లు సుధాకర్, జెడ్పీటీసీ సభ్యుడు సత్తిబాబు సీలేరు చేరుకున్నారు. -
సినీ నటుడు బాలాజీని విచారించిన పోలీసులు
సాక్షి, బంజారాహిల్స్: తన భార్యకు కిడ్నీ ఇచ్చిన తనకు ఎలాంటి చికిత్స చేయించకుండా బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న సినీ నటుడు బాలాజీపై బాధితురాలు భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ నిమిత్తం బా లాజీని స్టేషన్‌కు పిలిపించారు. కిడ్నీ మార్పిడి, బాధితురాలి నుంచి కిడ్నీ సేకరణ తదితర అంశాలపై వివరాలు సేకరించారు. తాము చట్ట ప్రకార మే లక్ష్మి నుంచి కిడ్నీని తీసుకున్నామని అందుకు తగిన డాక్యుమెంట్లను అందజేశారు. మానవతా దృక్ఫథంతోనే ఒప్పందం కుదర్చుకున్నామన్నారు. కిడ్నీ తీసుకునే ముందు ఆరుగురు డాక్టర్ల బృందం సర్టిఫై చేయాల్సి ఉంటుందని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నట్లు తెలిపారు. తనకు రూ. 20 లక్షలు ఇస్తామని, తన తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తామని, తనకు సిని మాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పినందునే తాను కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నానని భాగ్యలక్ష్మి తెలిపింది. తనకు రావాల్సిన డబ్బుల విషయమై ఫోన్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీనిపై నటి శ్రీరెడ్డితో కలిసి మానవ హక్కుల కమిషన్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, ‘మా’ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తనకు న్యాయం జరగకపోతే చావే శరణ్య మని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అనంతపురంలో టీడీపీ నేతల అరాచకం
అనంతపురం: అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. జేసీ బ్రదర్స్ నేమ్ స్టిక్కర్లను వాహనాలకు తగిలించుకొని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. భాగ్యలక్ష్మి అనే రిటైర్డ్ టీచర్ ఆస్తిపై కన్నేసిన టీడీపీ నేత రమేష్‌రెడ్డి.. ఒంటరిగా ఉంటున్న ఆమెను కిడ్నాప్ చేశాడు. బెదిరించి ఆస్తి రాయించుకోవడంతో పాటు.. ఆమె అకౌంట్ నుంచి రూ. కోటి డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకను గమనించిన రమేష్ రెడ్డి, అతడి అనుచరులు బ్యాంకు వద్ద నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారంలో రమేష్‌రెడ్డి ఉపయోగించిన బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంపై జేసీ బ్రదర్స్ నేమ్ స్టిక్కర్స్ ఉన్నాయి. ప్రస్తుతం భాగ్యలక్ష్మి పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. -
ఇన్నోవా బోల్తా: మహిళ మృతి
సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్‌కు చెందిన ఓ కుటుంబం ఆదిలాబాద్‌లో బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా మండలంలోని దగ్గి గ్రామ శివారులో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న భాగ్యలక్ష్మి(46) అక్కడికక్కడే మృతి చెందగా.. మాధవి, మునీంద్రాచారి, బ్రహ్మచారి, సాత్విక అనే నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.