దారాలమ్మ ఘాట్‌లో రోడ్డుకు అడ్డంగా నరికివేసిన చెట్ల వద్ద పాడేరు అసెంబ్లీ అభ్యర్థి భాగ్యలక్ష్మి
సీలేరు(పాడేరు): విశాఖ ఏజెన్సీ దారా లమ్మ ఘాట్‌లో దారలగొంది ప్రాంతం వద్ద మంగళవారం రాత్రి 7.30గంటల సమయంలో రెండు చెట్లను దుండగులు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. రెండుమూడు రోజులుగా పాడేరు అసెంబ్లీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తుండడంతో గిరిజనులు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని చూసి ఓర్వలేక పార్టీని, పార్టీ నాయకులను భయపెట్టేందుకు ఈ రకంగా నరికి ఉంటారని దారకొండ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
సోమ, మంగళవారాల్లో సీలేరు, దుప్పులవాడ, ధారకొండ, గుమ్మిరేవుల ప్రాంతాల్లో అర్థరాత్రి కూడా ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో కూడా జనాలు అధిక సంఖ్యలో తరలిరావడంతో అది చూసి ఓర్వలేక ఇలా చేశారని వారు తెలిపారు. 7గంటల సమయంలో ప్రచారం ముగించుకుని తిరిగి పాడేరు వెళ్తుం డగా చెట్లు నరికారని చెప్పారు. ఇది ముమ్మాటికి ఇతర పార్టీల నాయకుల పనేనని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని సీలేరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సూచన మేరకు భాగ్యలక్ష్మి తిరిగి సీలేరు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్ జిల్లా కార్యదర్శి జల్లు సుధాకర్, జెడ్పీటీసీ సభ్యుడు సత్తిబాబు సీలేరు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment