
సాక్షి, విశాఖపట్నం: కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వివాఖ ఏజెన్సీలోని మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మలకపాలెంలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన ఆవు మాంసాన్ని తినటం వల్ల ఈ ఘటన జరిగినట్టు వైద్యులు గుర్తించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment