చికిత్స పొందుతూ మహిళ మృతి | woman dies | Sakshi

చికిత్స పొందుతూ మహిళ మృతి

Published Thu, Jul 6 2017 9:55 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

woman dies

రాప్తాడు : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కవిత (26) అనే మహిళ మృతి చెందింది. వివరాలు అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన గుంజర ఎర్రిస్వామి, కవిత దంపతులు. వ్యక్తి గత పని నిమిత్తం బుధవారం ద్విచక్రవాహనంలో అనంతపురానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాప్తాడు మీదుగా అయ్యవారిపల్లికి బయలుదేరారు. అయ్యవారిపల్లి సమీపంలో రాప్తాడు చెరువులోకి వెళ్లే కాలువ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కవిత తలకు  గాయమైంది. వెంటనే అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. వారికి కుమారుడు, కుమారై ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement