గ్యాస్ సిలింటర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ నెల 7న ఎల్బీనగర్ భరత్‌నగర్, ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారిసహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో తీవ్రంగా గాయపడిన సాలమ్మ అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.