కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం వీరారెడ్డి పల్లె వాసులను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి.
సిరివెల్ల: కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం వీరారెడ్డి పల్లె వాసులను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. గ్రామంలో సుమారు 30 మందికి పైగా ఈ ప్రభావంతో మంచం పట్టారు. ఈ క్రమంలో కాకి రత్తమ్మ (30) వైరల్ ఫీవర్‌తో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి కన్నుమూసింది. పరిస్థితి తీవ్రతతో వైద్య బృందం మంగళవారం గ్రామానికి వచ్చి అనారోగ్యంతో మంచం పట్టిన వారి రక్త నమూనాలను సేకరించి ప్రత్యేక పరీక్షల కోసం పంపారు.