కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు ప్రబలాయి. దీంతో ఇద్దరు యువకులు మంగళవారం మృతి చెందారు. జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలోని ఇంటర్ విద్యార్థి సిద్దార్థ విష జ్వరం బారిన పడ్డాడు. దాంతో అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు.
అయితే అతడు మంగళవారం మరణించాడు. అలాగే మంథనిలో కూడా మరో యువకుడు రవి విష జ్వరంతో బాధపడుతూ... స్థానికంగా చికిత్స పొందుతున్నాడు. ఆ క్రమంలో అతడు కూడా మంగళవారం కన్నుమూశాడు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం అలముకుంది.