బోయినపల్లి(కరీంనగర్): విష జ్వరంతో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గుడిపద్మ(43) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. కొద్ది రోజుల కిందట కుమారుడికి విష జ్వరం రావడంతో.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించింది. బాబుకు నయం కాగా.. అదే సమయంలో ఆమెకు జ్వరం వచ్చింది.. దీంతో ఆమె కూడా అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది.