అనారోగ్యంలోనూ అదే అంకితభావం | Despite viral fever, Kareena Kapoor Khan sticks to her commitment | Sakshi
Sakshi News home page

అనారోగ్యంలోనూ అదే అంకితభావం

Published Mon, May 19 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

అనారోగ్యంలోనూ అదే అంకితభావం

అనారోగ్యంలోనూ అదే అంకితభావం

 ఇల్లే కదా స్వర్గసీమ అంటారు. అందరి ఇళ్ల గురించి పక్కన పెడితే ప్రముఖుల ఇళ్లు మాత్రం అలానే ఉంటాయి. అలాంటి ఓ పెద్ద భవంతి... అన్ని గదులకూ అందేలా సెంట్రలైజ్డ్ ఏసీ, పడవలాంటి కారు, పని చేసిపెట్టడానికి చిటికేస్తే వాలిపోయే మనుషులు.. క్రేజీ తారల జీవితం చాలా పసందుగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కరీనా కపూర్ లాంటి తారలదైతే... రాణీవాసం అనే చెప్పాలి. కష్టం అనేది తెలియకుండా పెరిగిన ఈ సుకుమారి సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ఎర్రటి ఎండలను, ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా షూటింగ్స్‌లో పాల్గొంటారు కరీనా. అందుకే ‘అంకితభావానికి చిరునామా కరీనా’ అని హిందీ చిత్రసీమలో అంటూ ఉంటారు. ఆమె అంకితభావానికి తాజాగా ఓ ఉదాహరణ చెప్పాలి.
 
 ఇటీవల కరీనా కపూర్‌కు వైరల్ ఫీవర్ వచ్చింది. షూటింగ్‌లో హుషారుగా పాల్గొనే స్థాయిలో ఆమె ఆరోగ్యం లేదు. ఆ విషయం తెలియకుండా ‘సింగమ్ 2’ షెడ్యూల్‌ను ఆ చిత్రదర్శకుడు రోహిత్‌శెట్టి గోవాలో ప్లాన్ చేశారు. ఇందులో అజయ్ దేవగణ్ సరసన కరీనా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ దేవగణ్ నిర్మాత కూడా. రోహిత్‌శెట్టి, అజయ్ తదితర చిత్రబృందం గోవా చేరుకున్నారు. ఊరు కాని ఊరులో షూటింగ్ అంటే ఖర్చు బోలెడు అవుతుంది. పైగా షూటింగ్ రద్దయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల డేట్స్ వృథా అవుతాయి. ఫలితంగా నిర్మాత నష్టపోతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జ్వరాన్ని సైతం లెక్క చేయకుండా కరీనా ముంబయ్ నుంచి గోవా వెళ్లారు. మందులు తీసుకుంటూ, ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆమె అంకితభావాన్ని చిత్రబృందం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement