రూ.100 కోట్ల క్లబ్ లో సింగమ్ రిటర్న్స్! | ajay Devgn's film Singham Returns earns Rs 91.55 crore; inching towards 100 crore club | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల క్లబ్ లో సింగమ్ రిటర్న్స్!

Published Tue, Aug 19 2014 6:07 PM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

రూ.100 కోట్ల క్లబ్ లో సింగమ్ రిటర్న్స్!

రూ.100 కోట్ల క్లబ్ లో సింగమ్ రిటర్న్స్!

ముంబై: అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటించిన 'సింగమ్ రిటర్న్స్' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం వసూళ్లలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. తొలి రోజే రూ.30 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సింగమ్ రిటర్న్స్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రూ. 92 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 2014లో విడుదలై అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన జాబితాలో చోటు సంపాదించింది.

 

తమిళ నటుడు సూర్య చేసిన సింగం 2 కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లతో  డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంటపండిస్తోంది. ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో  తెరకెక్కిన ఈ చిత్రంపై ఆది నుంచి భారీ అంచనాలే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement