కరీనా కపూర్, అజయ్ దేవ్‌గన్‌తో షూటింగ్ బాగా సరదాగా ఉంటుందని దర్శకుడు రోహిత్‌శెట్టి పేర్కొన్నాడు. ఈ జంటతో కలిసి సింగం-2 తీస్తున్న 41 ఏళ్ల రోహి త్... గతంలో అజయ్‌తో గోల్‌మాల్, గోల్‌మాల్ రిటర్న్స్-3 తదితర అనేక సినిమాలు తీశాడు. సింగం-2 తీస్తున్న సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ అజయ్ దేవ్‌గన్, కరీనా కపూ ర్ జంటగా మరోసారి సినిమా తీయడం ఆనందం కలిగి స్తోందన్నాడు. కరీనాకపూర్ మా కుటుం బ సభ్యురాలుగా, అజయ్ నాకు సోదరుడి మాదిరిగా అనిపిస్తుందన్నాడు. అందువల్లనే సెట్ వద్ద ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందన్నాడు. అసలు తనకు సినిమా షూటింగ్ చేస్తున్నట్టే ఉండదన్నాడు. కాగా కరీనా, అజయ్ జంటగా సింగంకు సీక్వెల్‌గా వస్తు న్న సింగం 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.
‘ఈ సినిమాలో అజయ్ పోలీసు అధికారి బాజీరావ్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో కరీనాకపూర్ ప్రేయసి పాత్రలో కనిపిస్తుంది. గోవాలో 20 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మిగతా భాగమంతా ముంబైలో తీస్తాం. గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే భాగాన్ని గోవా పరిసరాల్లో తీస్తున్నాం’ అని అన్నాడు. కాగా 2003లో జమీన్ సినిమాతో రోహిత్... బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. 11 ఏళ్ల తన కెరీర్‌లో రోహిత్ తీసిన అనేక సినిమాలు బాగా ఆడాయి. దీంతో అతడిని హిట్ మిషన్ అంటూ అంతా ప్రశంసిం చారు. ‘ఇలాంటి పొగడ్తలు బాగానే అనిపించినప్పటికీ అదే సమయంలో ఒత్తిడి కూడా బాగానే ఉంటుంది. నేను హిట్ సినిమాలు తీయాలని అంతా ఆకాంక్షిస్తారు. అయితే ఇందుకోసం ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది’అని అన్నాడు. సింగం 2 తర్వాత షారుఖ్ కథానాయకుడిగా రోహిత్ మరో సినిమా తీసే అవకాశముంది.
సరదాగా ఉంటుంది
Published Sun, May 18 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement
Advertisement