రోహిత్ శెట్టి మన్మోహన్ అంతటివాడు.. | Rohit Shetty is Manmohan Desai of this generation: Kareena Kapoor | Sakshi
Sakshi News home page

రోహిత్ శెట్టి మన్మోహన్ అంతటివాడు..

Published Fri, Jul 11 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

రోహిత్ శెట్టి మన్మోహన్ అంతటివాడు..

రోహిత్ శెట్టి మన్మోహన్ అంతటివాడు..

ముంబై: రోహిత్ శెట్టి తాజా సినిమా సింగమ్ రిటర్న్స్‌లో నటిస్తున్న కరీనా కపూర్ అతడిపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన నిన్నటితరం దర్శకుడు మన్మోహన్ దేశాయ్‌తో రోహిత్ పోటీపడగలడని కితాబిచ్చింది.  ‘రోహిత్.. నేటితరం మన్మోహన్ దేశాయ్ వంటివాడు. అతణ్ని నేను ఇదే పేరుతో పిలుస్తాను. ప్రతి ఒక్క హీరోయిన్ ఇతని దగ్గర పనిచేయాలని కోరుకుంటుంది. నాకు గతంలోనూ మంచి అవకాశాలు ఇచ్చాడు’ అని వివరించింది.

 సింగమ్‌లో కాజల్ హీరోయిన్‌గా నటించినా, దీని సీక్వెల్‌లో మాత్రం బెబోకు అవకాశం వచ్చింది. రోహిత్‌కు తాను పెద్ద అభిమానిని కాబట్టే ఈ రెండో భాగంలో నటించేందుకు సంతోషంగా ఒప్పుకున్నానని వివరించింది.  ‘ఇంతకుముందు కూడా అజయ్ దేవ్‌గణ్‌తోపాటు నటించాను కాబట్టి షూటింగ్ సెట్లు మా ఇల్లులాగే అనిపించాయి.  ఇందులో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది’ అని కరీనా వివరించింది. సింగమ్ రిటర్న్స్ వచ్చే నెల 15న విడుదలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement