కోలుకుంటున్న సీఎం కేసీఆర్ సతీమణి | KCR wife health some recovered after viral fever effected, says Yashoda doctors | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న సీఎం కేసీఆర్ సతీమణి

Published Thu, Jan 22 2015 6:55 AM | Last Updated on Wed, Aug 15 2018 8:59 PM

వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ రెండు రోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభారాణి ఆరోగ్య పరిస్థితి బుధవారం కొంత మెరుగుపడినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

సాక్షి, హైదరాబాద్: వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ రెండు రోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభారాణి ఆరోగ్య పరిస్థితి బుధవారం కొంత మెరుగుపడినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బుధవారం కేసీఆర్, కేటీఆర్, కవితతో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, వైద్య ఆరోగ్య మంత్రి టి.రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆస్పత్రికి వెళ్లి శోభారాణిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement