కోలుకుంటున్న సీఎం కేసీఆర్ సతీమణి
సాక్షి, హైదరాబాద్: వైరల్ ఫీవర్తో బాధపడుతూ రెండు రోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభారాణి ఆరోగ్య పరిస్థితి బుధవారం కొంత మెరుగుపడినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బుధవారం కేసీఆర్, కేటీఆర్, కవితతో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, వైద్య ఆరోగ్య మంత్రి టి.రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆస్పత్రికి వెళ్లి శోభారాణిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.