గాలివీడు(వైఎస్సార్‌జిల్లా): విషజ్వరంతో విద్యార్థిని మృతిచెందిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గాలివీడు మండలం నూలివీడులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోక్షిత(13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా విషజ్వరంతో బాధపడుతోంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందినట్టు సమాచారం.