ఆస్పత్రుల పాలవుతున్న రోగులు
బెలగాం, న్యూస్‌లైన్: పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా జ్వరాలు వణికిస్తున్నాయి. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కువగా వైరల్ జ్వరాలతో బాధపడుతూ అస్పత్రులకు వస్తున్నారు. దీంతో గురువారం నాటికి ఏరియా ఆస్పత్రిలో సుమారు 130మంది రోగులు చికిత్స పొందుతున్నారు. జ్వరాల కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పార్వతీపురం పట్టణం, మండలంతో పాటు గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, తదితర మండలాలనుంచి జ్వరపీడితులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి వస్తున్నారు.
ప్రతిరోజూ ఓపీలో దాదాపు 500మంది చికిత్స కోసం వ స్తే వారిలో 300మంది వరకు జ్వరపీడితులే ఉంటున్నారు. తీవ్రమైన ,తలనొప్పి, కాళ్లు, చేతుల పీకులు,కండరాల నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్నవారు ఆస్పత్రిలో చేరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి రెండు వార్డుల్లో 40మంది జ్వరపీడితులు చికిత్స పొందుతున్నారు. వాతావరణ మా ర్పుల కారణంగా జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి...
వాతావరణ మార్పుల వల్లే జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ జ్వరాల ఉనికి కనిపిస్తోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాల బారిన పడకుండా ఉండవచ్చు. మంచినీటిని మరిగించి చల్లార్చి వడపోసి తాగడం మేలు. నిల్వ ఆహారపదార్థాలను తీసుకోకూడదు. ఎండ వాతావరణంలో బయటకు వెళ్లేవారు తల, ముఖానికి కప్పుకోవడం మంచిది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు వృద్ధి చెందవు. జాగ్రత్తలు పాటిస్తూ దోమతెరలు వినియోగించడం ఎంతో ఉపయుక్తం.
- డాక్టర్ జి.నాగభూషణరావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్
వణికిస్తున్న జ్వరాలు
Published Fri, May 23 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement