
ప్రాక్టీస్... ప్రాక్టీస్...
జోరుగాధోని సాధన
రెండో వన్డేకూ
సురేశ్ రైనా దూరం
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు రెండు రోజుల ముందు మంగళవారం భారత ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ మాత్రమే. దాంతో కోహ్లి, రహానే, రోహిత్ తదితర ఆటగాళ్లంతా సాధనకు దూరంగా విశ్రాంతి తీసుకున్నారు. అయితే కెప్టెన్ ధోని మాత్రం తన బ్యాటింగ్‌కు మరింత పదును పెట్టే పనిలో పడ్డాడు. జూనియర్లతో కలిసి సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ముందుగా పేసర్ ధావల్ కులకర్ణిని ఎదుర్కొన్న అతను, ఆ తర్వాత కోచ్‌లు కుంబ్లే, బంగర్ విసిరిన త్రో డౌన్‌సలను పదే పదే పుల్ షాట్‌లు ఆడాడు.
మరో వైపు కొత్త బౌలర్ జయంత్ యాదవ్ బౌలింగ్‌లో కూడా ప్రాక్టీస్ చేసిన ధోని అతనికి ఈ సందర్భంగా పలు సూచనలిచ్చాడు. ఫీల్డింగ్ స్థానాలను బట్టి ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు. జ్వరం కారణంగా తొలి వన్డేకు దూరమైన సురేశ్ రైనా జట్టుతో కలిశాడు. కొద్దిసేపు ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే జ్వరం పూర్తిగా తగ్గకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ అతను ఆడటం లేదని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. నెట్స్‌లో జాదవ్ కూడా తీవ్రంగా సాధన చేశాడు. బ్యాటిం గ్‌తో పాటు చాలా సేపు ధోని, రైనాలకు బౌలింగ్ చేశాడు.