విషజ్వరంతో విద్యార్థిని మృతి | student died with viral fever | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో విద్యార్థిని మృతి

Published Wed, Sep 28 2016 10:09 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

student died with viral fever

గాంధీనగరం (శిరివెళ్ల ): విషజ్వరంతో మండలంలోని గాంధీనగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి వట్టికట్టి శ్రీలక్ష్మి (16) బుధవారం మృతిచెందింది. ఈ నెల 27వ తేదీన సైన్స్‌ పరీక్ష రాయాల్సిన ఈ విద్యార్థిని..జ్వరం అధికం కావడంతో వైద్యం కోసం ఆళ్లగడ్డకు చికిత్స చేయించుకుంది. బుధవారం జ్వరం మరింత అధికం కావడంతో హుటాహుటిన యర్రగుంట్లలోని ఓ ప్రై వేట్‌ క్లినిక్‌కు తరలించగా అక్కడ పరిస్థితి విషమించింది. మెరుగైన lవైద్యం కోసం నంద్యాల ఆస్పత్రికి తరలిస్తుడంగా మార్గమధ్యలో దీబగుంట్ల వద్ద మృతి చెందింది. విషయం తెల్సుకున్న ప్రధానోపాధ్యాయుడు సుబ్రమణ్యం, టీచర్లు గ్రామానికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించారు. జ్వరం కారణంగా ఈ విద్యార్థిని శ్రీకాళహస్తీలో జరగనున్న రాష్ట్రస్థాయి త్వైక్వాండో పోటీలకు హాజరు కాలేకపోయిందని ఉపాధ్యాయులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement