విషాదం నింపిన జ్వరాలు | two children died of viral fever | Sakshi
Sakshi News home page

విషాదం నింపిన జ్వరాలు

Published Sat, Nov 9 2013 12:59 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

two children died of viral fever

ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ మండలం ఖండాల తండా గ్రామానికి చెందిన ఆడె మనోజ్-గాంధీబాయి దం పతుల కుమారుడు దయరామ్(3) శుక్రవారం జర్వంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... బా లుడు దయరామ్ గురువారం ఉదయం నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు ఇంద్రవెల్లి మండలక కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు ఆస్పత్రిలో ఉన్న వారిని సైత కంటతడి పెట్టించాయి. ముక్కుపచ్చలారని తమ కొడుకుకు మూడేళ్లకే నిండు నూరేళ్లు నిండాయూ అంటూ తల్లిదండ్రులు ఏడుస్తున్న సంఘటన హృదయ విదారకంగా అనిపించింది.
 
 విషజ్వరతో ఆరేళ్ల బాలిక..
 శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : శ్రీరాంపూర్ ఏరియాలోని అరుణక్కనగర్‌కు చెందిన గోలేటి అపర్ణ(6) విష జ్వరంలో శుక్రవారం మృతి చెందింది. వివరాలిలా ఉన్నారుు. భీంరావు, సుజాతల దంపతుల కూతురు అపర్ణ. భీంరావు కూలి పనిచేస్తుంటాడు. అపర్ణకు మూడు రోజుల కిత్రం జ్వరం రావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం తెల్ల రక్తకణాలు 70 వేలుగా వచ్చింది. దీంతో కరీంనగర్ చల్మెడ ఆనంద్‌రావు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్ష చేయగా 20 వేలకు తగ్గాయి. అప్పటి నుంచి చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. డెంగీ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారని బాలిక తండ్రి భీంరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement