గూడూరు: విషజ్వరంతో గూడూరు పడమర బీసీ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు కిరణ్‌కుమార్ మృతి చెందాడు. తల్లిదండ్రులు మంగలి రాజశేఖర్, కాలేశ్వరీ తెలిపిన వివరాలు మేరకు.. ఈ నెల 5న బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో స్థానిక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. డెంగీ లక్షణాలు కనిపించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కోలుకోలేక బుధవారం ఉదయం ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక వైద్యాధికారి నారాయణ, వైద్య సిబ్బంది పడమర బీసీ కాలనీలో పర్యటించి బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకున్నారు. విషజ్వరంతో బాలుడు మృతి చెందినట్లు విలేకరులకు వైద్యాధికారి తెలిపారు.