వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం వెల్లాల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ, సంజీవరాయస్వామి ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
రాజుపాలెం (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం వెల్లాల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ, సంజీవరాయస్వామి ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం వైభవంగా స్వామి వారి పల్లకీ సేవ కార్యక్రమాన్ని జరిపారు.
ఈ సందర్భంగా స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై పల్లకీలో ఊరేగారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, ఎస్సైలు పాల్గొన్నారు.