వైఎస్సార్ జిల్లా (రాజుపాలెం) : రాజుపాలెం మండలానికి, వెంగళాయపాలెం గ్రామానికి మధ్యనున్న మడవంక పొంగటంతో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు శనివారం వరద నీటిలో చిక్కుకుపోయింది. ప్రయాణికులు వెంటనే దిగిపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరు వెళుతోంది. బస్సును వరద నీటి నుంచి బయటికి లాగేందుకు పరిసర గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.