
సాక్షి, డోనెకల్: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, వాగులు, చెరువుల పొర్లిపొంగుతున్నాయి. కాగా, వర్షాల నేపథ్యంలో గుత్తి నుంచి బళ్లారి వెళ్లుండగా ఆర్టీసీ బస్సు.. డోనెకల్ వాగులో చిక్కుకుంది. బస్సు నీటిలో ఉన్న సమయంలో 30 మంది ప్రయాణికులు లోపల ఉన్నారు. అయితే, బస్సు వాగులో చిక్కుకోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై.. ట్రాక్టర్ సాయంతో బస్సును బయటకు తీశారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment