దొంగ చేతివాటం: ఏకంగా ఆర్టీసీ బస్సునే.. | Thief Robbed RTC Bus In Anantapur | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును దొంగిలించిన దొంగ

Published Fri, May 22 2020 4:33 PM | Last Updated on Fri, May 22 2020 4:49 PM

Thief Robbed RTC Bus In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సుపైనే తన చేతివాటాన్ని చూపించాడు. బస్సును దొంగిలించిన కొన్ని గంటల్లోనే పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని ధర్మవరంలో చోటుచేసుకుంది. వివరాలు.. శుక్రవారం ధర్మవరం ఆర్టీసీ బస్‌ స్టాండ్‌లో ఓ బస్సును మరమ్మత్తు చేసిన సిబ్బంది భోజనానికి వెళ్లిపోయారు. అదే అదునుగా భావించిన ఓ దొంగ మరమ్మత్తు చేయబడ్డ ఏపీ02జెడ్‌552 బస్సును దొంగిలించి వేగంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బస్సు దొంగతనానికి గురైందని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కియా ఫ్యాక్టరీ వద్ద బస్సుతో సహా దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కర్ణాటకకు చెందిన దొంగగా పోలీసులు భావిస్తున్నారు. ( కన్నతండ్రి కామ పిశాచిగా మారి..)

చదవండి : 21 ఏళ్ల యువతికి ఆరో తరగతి బాలుడి వేధింపులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement