టీడీపీ నాయకులు, అధికారులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి నేతృత్వం వహించేందుకు బద్వేలు నియోజకవర్గంలోని రెండు వర్గాల మధ్య కుమ్ములాట మొదలైంది. వివరాలు.. బద్వేల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (ఆగస్టు 17) పర్యటించనున్నారని టీడీపీ వెల్లడించించి. అయితే హెలీప్యాడ్, బహిరంగ సభ వీరారెడ్డి కాలేజీలో పెట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సన్నాహకాలు చేస్తుండగా.. ఎమ్మెల్యే జయరాములు ఆమెకు వ్యతిరేకంగా గళమెత్తారు. కాలేజీలో సభ ఏర్పాట్లు చేయొద్దంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో సభ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గ పోరుతో అయోమయంలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment